ప్రియాకి మెమరీ లాస్!

Priya Varrier

కేరళ కుట్టికి దేశమంతా గుర్తింపు తెచ్చింది ఒకే ఒక్క సాంగ్. ఒక మలయాళ చిత్రంలో ఆమె నటించింది. అందులో ఆమె ఒక పాటలో కన్ను కొట్టిన విధానం చూసి దేశమంతా ఫిదా అయింది. ‘కన్ను కొట్టి’ పాపులారిటీ కొల్లగొట్టింది. ఒక్కసారిగా స్టార్ అయిపొయింది. ఆమెకి అదే మొదటి చిత్రం కూడా.

ఐతే, ఆమె నటించిన ఆ సినిమా మాత్రం ఆడలేదు. ఇక తెలుగులో కూడా ఆమె నటించిన ‘ఇష్క్:నాట్ ఏ లవ్ స్టోరీ’, ‘చెక్’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఆమె మొదటి చిత్రం గురించి మళ్ళీ రగడ మొదలైంది. ఈ భామకి మెమోరీ లాస్ అయింది అని ఆమె మొదటి చిత్ర దర్శకుడు చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయింది.

ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆ దర్శకుడికి కోపం వచ్చింది. ‘ఒరు ఆడారు లవ్’ అనే సినిమాలో కన్ను కొట్టే ఐడియా పూర్తిగా నాదే అంటూ ప్రియా చెప్పింది. దాంతో, ఆ సినిమా దర్శకుడు ఒమర్ లులు గట్టిగా జవాబు ఇచ్చారు. మొదటి సినిమాలో నేను ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాను. మొదటి చిత్రంలోనే దర్శకుడికి ఐడియాలు ఇచ్చాను అని ఆమె అనుకోవడం భ్రమ. అదే మాట అన్నారు దర్శకుడు ఒమర్.

ఆమె మెమరీ లాస్ కి మందులు తీసుకుంటే బెటర్ అంటూ ఘాటుగా స్పందించారు ఒమర్.

Priya Varrier

ప్రియా వారియర్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ చిత్రం ‘బ్రో’లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. వచ్చేనెల విడుదల కానుంది ‘బ్రో’.

Advertisement
 

More

Related Stories