మాజీ భర్త పోస్ట్ పై కామెంట్ వైరల్

Aditi Rao

ఆదితి రావు ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తనకి పెళ్లి అయిన విషయం బయట పెట్టలేదు. అలాగే, విడిపోయిన విషయమూ చెప్పలేదు. ఎప్పుడూ సింగిల్ గాల్ అనే ఇమేజ్ నే క్యారీ చేసింది. ఐతే, బాలీవుడ్ మీడియా మాత్రం ఆమె కొన్నేళ్ల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకొందని…మూడేళ్ళ తర్వాత విడిపోయిందని రాశాయి.

రెండు రోజుల క్రితం ఆమె ఒక ఇన్ స్టాగ్రామ్ ఫోటోపై కామెంట్ చెయ్యడం, అది వైరల్ కావడంతో ఆమె పెళ్లి గురించి మరోసారి ఫోకస్ లోకి వచ్చింది. ఆదితి సత్యదీప్ మిశ్రా ఫోటోకి రెస్పొండ్ అయింది. “ఉఫ్…” అంటూ కామెంట్ చేసింది. దాంతో ఆమె కామెంట్ ని జనం వైరల్ చేశారు.

“మాజీ భర్త ఫోటోలకు ఆదితి కామెంట్ పోస్ట్ చేసింది…” అంటూ ఎన్డీటీవీ వంటి ఫేమస్ వెబ్ సైట్ లు కూడా వార్తలు ప్రచురించడంతో మరోసారి ఆమెకి ఇప్పటికే ఒకసారి పెళ్లి జరిగిందనే విషయం బయటికి వచ్చింది. సత్యదీప్ ని 2009లో పెళ్లి చేసుకొంది. 2013లో ఇద్దరూ విడిపోయారు.

ఆమె ప్రస్తుతం ‘మహా సముద్రం’ సినిమాలో నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories