ఆఫర్ల కోసం దివి వడ్త్యా కాల్స్!

Divi Vadthya

దివి వడ్త్యా తెలుగులో చాలా సినిమాలు చేసింది. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్నంత క్రేజ్ బయట లేదు ఈ భామకి. పైగా ఆమె ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో హీరోయిన్ గా రాణించలేదు. సైడ్ క్యారెక్టర్లలో మాత్రం గుర్తింపు తెచ్చుకొంది.

హీరోయిన్ గా క్రేజ్ దక్కితే నిర్మాతలు, దర్శకులే కాల్షీట్ల కోసం వెంట పడుతారు. కానీ సైడ్ రోల్స్ చేసే వారికి సొంతంగానే పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి. మేనేజర్ నిర్మాతల వెంటపడి అవకాశాలు ఇప్పించాలి. అందుకే, దివి కొత్తగా అవకాశాలు కావాలని తానే నిర్మాతలకు, దర్శకులకు ఫోన్ చేస్తోందట.

సినిమాల్లో ఆమె ఎక్కువగా సీరియస్ పాత్రలే చేస్తోంది. గ్లామర్ పాత్రలు కావాలని కోరుకుంటోంది. పుష్ప 2, డాకు మహారాజ్ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఇంకా భారీ ఆఫర్లు రావడం లేదు అందుకే ఈ తిప్పలు.

మహర్షి, రుద్రంగి, లంబసింగి, పుష్ప 2, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ తెలుగు 4లో కూడా పాల్గొంది దివి. ఇన్ స్టాగ్రామ్ లో 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ భామకి.

More

 

Related Stories