విదేశాల్లో డ్రాగన్ షూటింగ్

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మొదలైన “డ్రాగన్” చిత్రం ఆగిపోయింది అని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అది ఆగిపోలేదు, కొంత బ్రేక్ తర్వాత షూటింగ్ జరుగుతుంది అని తెలుగుసినిమా.కామ్ క్లారిటీ ఇచ్చింది. అదే నిజమైంది.
“డ్రాగన్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది,” అని తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆగిపోలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు.
తాజా సమాచారం ప్రకారం “డ్రాగన్” షూటింగ్ త్వరలోనే విదేశాల్లో జరగనుంది. యూరోప్, ఆఫ్రికా దేశాల్లో లొకేషన్ లను చూసేందుకు నీల్ వెళ్తున్నారు. లొకేషన్లు కన్ఫర్మ్ కాగానే షూటింగ్ మొదలవుతుంది. నవంబర్ నెలాఖరులో లేదా డిసెంబర్లో విదేశాల్లో షూటింగ్ షురూ అవుతుంది.
ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేసిన మాట వాస్తవమే. హీరోయిన్ ని మొదట రుక్మిణి వసంత్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కథలో జరిగిన మార్పుల ప్రకారం ఆమెని తీసుకుంటారా లేక మరో హీరోయిన్నా అనేది చూడాలి. అలాగే ఈ సినిమాని ఇంతకుముందు జూన్ 2026లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమా పూర్తి కావడం కష్టం అనిపిస్తోంది.