దుల్కర్… అలనాటి హీరో!

దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి పేరు వచ్చింది. “మహానటి” సినిమా వల్లా ఆ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత “సీతారామం”, “లక్కీ భాస్కర్”, “కల్కి” సినిమాలతో తెలుగునాట మంచి మార్కెట్ పొందారు దుల్కర్.
ఐతే, దుల్కర్ కెరీర్ ని పరిశీలీస్తే అతను ఎక్కువగా పీరియడ్ పాత్రలు చేస్తున్నారు. అంటే గతించిన కాలంలోని కథానాయకుడిగా కనిపిస్తున్నారు. అందునా గత కాలపు హీరో పాత్రల్లో అదరగొడుతున్నారు.
ALSO READ: Kaantha Trailer: Crime and cinema, a heady mix
మహానటి” సినిమాలో నటి సావిత్రిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్న అలనాటి హీరో జెమిని గణేష్ గా అద్భుతంగా నటించారు. ఇప్పుడు “కాంత” అనే సినిమాలో కూడా 1960ల నాటి సినిమా హీరోగా కన్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ ని బట్టి చూస్తే దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో కూడా పాత కాలపు హీరోగానే నటిస్తున్నారు. ఇలాంటి పాత్రలకు అతను కేరాఫ్ గా మారినట్లు కనిపిస్తోంది.
దుల్కర్ సల్మాన్ తన స్టార్ డం కన్నా కథకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన నటించే సినిమాల్లో అయినా, నిర్మించే సినిమాల్లోనైనా ఇదే పద్దతి.