‘డంకీ’ మొదటి పాట వచ్చేసింది

Dunki

షారూక్ ఖాన్‌ ఈ ఏడాది ఇప్పటికే రెండు కళ్ళు చెదిరే హిట్స్ అందించారు. ఇప్పుడు ఆయన టాప్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఒక మూవీ చేశారు. అదే… ‘డంకీ’. ఈ సినిమా డిసెంబర్ 22న మన ప్రభాస్ నటించిన “సలార్”తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది.

ఈ సినిమా తొలి పాట‌గా రొమాంటిక్ సాంగ్‌ను బుధ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రీత‌మ్ సంగీతాన్ని అందించ‌గా, అర్జిత్ సింగ్ పాట‌కు ప్రాణం పోశారు. షారుక్, హీరోయిన్ తాప్సిపై ఈ పాటని చిత్రీకరించారు.

తాప్సికి ఇది పెద్ద చిత్రం. ఆమె కెరీర్ మరో మలుపు తిరగొచ్చు. ఇప్పటివరకు ‘సస్తి’ కంగనా అన్న పేరు తెచ్చుకొని ‘ఫిమేల్ ఓరియెంటెడ్’ చిత్రాలు చేసింది. ఇప్పుడు ఒక పెద్ద హీరో సరసన నటించింది.

రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ‘డంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More

 

Related Stories