Advertisement

ఇండియన్ పనోరమా 2019 సినిమాల లిస్ట్ ప్రకటించింది భారత ప్రభుత్వం. గోవా ఫిలిం ఫెస్టివల్ లో పనోరమా సెక్షన్ లో ప్రదర్శించే సినిమాల్లో తెలుగు నుంచి ఒకే ఒక్క చిత్రం ఎంపికైంది. అదే దిల్ రాజు నిర్మించిన “ఎఫ్ 2”.

తమిళ్ నుంచి “హౌజ్ ఓనర్”, “ఒత్త సెరుప్పు సైజు 7” చిత్రాలు సెలెక్ట్ అయ్యాయి. మలయాళం నుంచి “ఉయిరే”, “కొలంబి””జల్లికట్టు” చిత్రాలకు చోటు దక్కింది. ఇక బాలీవుడ్ నుంచి “గల్లీ బాయ్”, “యూరి”, “బాధాయి హో”, “సూపర్ 30” వంటి సినిమాలు ఈ గౌరవాన్ని పొందాయి.

తెలుగు నుంచి తమ సినిమా సెలెక్ట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి యమా ఖుషీగా ఉన్నాడు. తన ఫోటోతో పోస్టర్ వేయించుకున్నాడు. వినోదాత్మక చిత్రంగా రూపొందిన “ఎఫ్ 2” హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. 80 కోట్లకు పైగా వసూళ్లు అందుకొంది. ఇప్పుడు ఇదే సినిమాకి సీక్వెల్ రానుంది.

Advertisement

This post was last modified on October 21, 2020 2:16 pm

Advertisement
Share