ఇక గ్లామర్ పై ప్రత్యేక దృష్టి

TeluguCinema 10 Nov 2025
Faria Abdullah

ఫరియా అబ్దుల్లా “జాతి రత్నాలు” సినిమాతో అడుగుపెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు ఇంకో రేంజ్ కి వెళ్లాలనుకుంటోంది. దానికి దగ్గరి దారి.. అందాల ఆరబోత.

అందుకే ఈ భామ ఇటీవల ఎక్కువగా గ్లామరస్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది.

ఫరియా చాలా పొడుగు. ఆమె అందరి సరసన సూట్ అవదు. పొడుగైన హీరోలతోనే ఆమెకి అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి, అల్లరి నరేష్, సంతోష్ శోభన్, రవితేజ వంటి హీరోలతో నటించింది.

ఇప్పటి వరకు అరడజన్ సినిమాల్లో నటించింది. మరో రెండు, మూడు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసింది. అయినా ఇంకా ఆమెకి క్రేజ్ రాలేదు. దాంతో ఈ భామ ఇప్పుడు గ్లామర్ రూట్ ఎంచుకొంది. అందాల ఆరబోత వల్ల సినిమాల్లో అవకాశాలు రావు. ఒకప్పుడు అలాంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అలా సాగడం లేదు.

ఐతే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసి ఫోటోషూట్లు చేసి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నది సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం కోసం. ఎంత ఎక్కువమంది ఫాలోవర్స్ ఉంటే celebrity influencer గా అంత ఎక్కువగా సంపాదించొచ్చు. ఆ టార్గెట్ తోనే ఫరియా బికినీ ఫోటోషూట్ ల సహా చేస్తోంది.