FCUK రెండో పాట విడుద‌ల

జగ‌ప‌తిబాబు పాత్ర పోషించిన చిత్రం…. ‘FCUK’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంటగా నటించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌ కానుంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌కుడు. బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారి.

రీల్ హీరోల‌కు బ‌దులు రియ‌ల్ హీరోల‌తో ‘ఎఫ్‌సీయూకే’ పాట‌ల‌ను విడుద‌ల చేయించాల‌ని నిర్ణ‌యించుకొంది ఈ చిత్ర బృందం. అందులో భాగంగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే తొలి పాట‌ను ప్ర‌ముఖ ఆర్థోపెడీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.వి. గుర‌వారెడ్డి విడుద‌ల చేశారు.

లేటెస్ట్‌గా బుధ‌వారం “నేనేం చెయ్య‌..” అంటూ సాగే రెండో పాట‌ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు విడుద‌ల చేశారు.

Advertisement
 

More

Related Stories