సమ్మె రద్దు, షూటింగ్లు షురూ

TeluguCinema 22 Aug 2025
Film Shootings

దాదాపు 20 రోజుల పాటు సాగిన తెలుగు చిత్రసీమ కార్మికుల సమ్మె ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం కలగచేసుకొని కార్మికులకు, నిర్మాతలకు మధ్య రాజీ కుదిర్చింది. కార్మికులు 30 శాతం వేతనాల పెంపు డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి 22. శాతం పెంచేలా ఒప్పించారు. నెమ్మదిగా 30 శాతం పెంచుతామని నిర్మాతలు అంగీకరించారు. అలాగే, నిర్మాతల నిబంధనలు, డిమాండ్లకు కూడా కార్మికులు ఒప్పుకున్నారట.

ఇక సినిమా షూటింగులు అన్నీ మొదలు కానున్నాయి.

షూటింగుల రద్దు వల్ల రవితేజ హీరోగా నటిస్తున్న “మాస్ జాతర” చిత్రం ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసుకోలేకపోయింది. ఈ నెల 27న విడుదల కావాల్సిన మూవీ వాయిదాపడింది. అలాగే, సంక్రాంతికి విడుదల కావాల్సిన చిరంజీవి – అనిల్ రావిపూడి చిత్రం కూడా షూటింగ్ రేసులో వెనుకబడింది. దీపావళికి విడుదల కావాల్సిన రామ్ పోతినేని చిత్రం “ఆంధ్రా కింగ్ తాలూకా” నవంబర్ 28కి వెళ్ళింది.

ఇంకా పది, ఇరవై రోజులు ఇలాగే సమ్మె కొనసాగి ఉంటే, సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలు కూడా సమ్మర్ కి వాయిదాపడేవి. మొత్తానికి ఒక ముగింపు వచ్చింది.