Advertisement
తెలుగు న్యూస్

అప్పుడు గబ్బర్ సింగ్ ఇప్పుడు భగత్ సింగ్


సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. అలాగే క్యాచీనెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతారు మన మేకర్స్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక సంచలనం …’గబ్బర్ సింగ్’. కొన్ని వరుస అపజయాల కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశలో ఉన్న టైంలో పడిన సాలిడ్ బ్లాక్ బస్టర్ … ‘గబ్బర్ సింగ్’. దాదాపు దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా వస్తోంది.

సో.. గబ్బర్ సింగ్ లా ఇప్పుడు భగత్ సింగ్ అనే టైటిల్ ని పెట్టారు. వీరి కొత్త సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ టైటిల్ వినడానికి కూడా సూపర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ కి సరిపోతుంది.

‘గబ్బర్ సింగ్’లో కేవలం వినోదం మాత్రమే ఉంది. కానీ ఈ సారి కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు అని చెప్తున్నారు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ మూవీ త్వరలోనే మొదలు కానుంది.

‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్ ని కొత్తగా ఎలా ఆవిష్కరించానో ఇందులో కూడా అలా చేస్తానని హరీష్ మాటిస్తున్నారు. తొలి పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ చూస్తుంటేనే అర్థం అవుతోంది.

Advertisement

This post was last modified on September 9, 2021 9:02 am

Advertisement
Share