గని, రామారావుది ఆదే దారి

Ghani

ఒకే సినిమాకు 2 రిలీజ్ డేట్స్ ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ గా మారింది. విడుదలకు సంబంధించి కుదిరితే ప్లాన్-ఏ, కుదరకపోతే ప్లాన్-బి అన్నట్టు 2 తేదీలు ప్రకటిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” సినిమాతో దర్శకుడు రాజమౌళి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను ఇప్పుడు అంతా ఫాలో అయిపోతున్నారు.

ఇప్పటికే “భీమ్లానాయక్” నిర్మాతలు 2 రిలీజ్ డేట్స్ ప్రకటించారు. “గని” సినిమాకు సంబంధించి కూడా 2 రిలీజ్ డేట్స్ వచ్చాయి. ఫిబ్రవరి 25న కానీ మార్చి 4న కానీ విడుదల చేస్తామని “గని” నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. ఇది బాక్సింగ్ డ్రామా.

ఇప్పుడీ దారిలో రామారావు కూడా నడిచాడు. రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించి తాజాగా రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఈ సినిమాకు మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఒకవేళ ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదాపడితే మార్చి 25కే రవితేజ సినిమా వస్తోంది. ఆర్ఆర్ఆర్ మార్చి 25కి వస్తే, అప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాను ఏప్రిల్ 15కు విడుదల చేస్తారు.

ప్రస్తుతం అన్ని సినిమాల విడుదల తేదీలు ఇలాగే ఉన్నాయి. ఒకరు తప్పుకుంటే ఇంకొకరు వచ్చేలా ఉన్నారు.

Advertisement
 

More

Related Stories