
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గాయని సయింధవి విడిపోతున్నట్లు ప్రకటించి ఏడాది అయింది. తాజాగా చెన్నైలోని ఒక ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఆరు నెలలకు పైనే విడిగా ఉన్న ఈ జంట తాము ఇక కలిసి ఉండలేమని భావించిన తర్వాత తమ మనపూర్వకంగా విడిపోతామని తేల్చి చెప్పడంతో కోర్టు వారికి విడాకులు గ్రాంట్ చేసింది.
12 ఏళ్ళు పాటు కాపురం చేశారు. వీరికి ఒక కూతురు. ఆ పాప తల్లి వద్దే పెరగాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవలే “సార్” సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇది అతనికి రెండో జాతీయ అవార్డు. సైన్ధవి అనేక సినిమాల్లో పాటలు పాడారు. ప్రస్తుతం చెన్నైలో కచేరీలు చేస్తున్నారు.
సంగీతంతో పాటు హీరోగా కూడా అనేక సినిమాలు చేస్తుంటారు జీవీ ప్రకాష్ కుమార్.





