ఇటు రూమర్లు, అటు విహార యాత్రలు

Hansika Bali vacation in August 2025

హన్సిక వ్యక్తిగత జీవితంపై పుకార్లు ఇప్పటివి కాదు. దాదాపు 2 నెలలుగా ఆమె వైవాహిక జీవితంపై పుకార్లు వస్తున్నాయి. భర్త నుంచి ఆమె విడిపోయినట్టు దాదాపు అన్ని వెబ్ సైట్లలో కథనాలు కనిపిస్తున్నాయి.

ప్రారంభంలో ఆమె భర్త ఈ పుకార్లను ఖండించినప్పటికీ, ఆ తర్వాత అవి మరింత బలపడ్డంతో, అతడు కూడా కనిపించడం మానేశాడు.

మరోవైపు హన్సిక కూడా ఈ పుకార్లపై స్పందించడం మానేసింది. ఇప్పుడామె వెకేషన్ లో ఉంది. ఇండోనేషియాలోని సాగర తీరాల్లో ఆమె ఎంజాయ్ చేస్తోంది. చూస్తుంటే, ఆమె తన వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.

తన పర్సనల్ లైఫ్ పై వస్తున్న వార్తలు చూసి ఆమె నవ్వుతున్నట్టు గతంలో ఓ పోస్టు పెట్టింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్ కామెంట్స్ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. “నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టింది.

అయితే హన్సిక-సోహైల్ విడాకుల వ్యవహారం మాత్రం ఇంకా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉంది. దీనికి కారణం, ఆమె తన ఎకౌంట్ నుంచి పెళ్లి ఫొటోలు, వీడియోలు, సోహైల్ ఫొటోల్ని దశలవారీగా డిలీట్ చేయడమే.

More

 

Related Stories