పెళ్లి చేసుకున్న ‘జెర్సీ’ నటుడు

నాని నటించిన జెర్సీ సినిమాలో కొడుకు పాత్ర పోషించిన హరీష్ కళ్యాణ్ గుర్తున్నాడా? అతను ఓ ఇంటి వాడయ్యాడు. ఈ తమిళ హీరో నర్మద అనే యువతిని పెళ్లాడాడు.

‘జెర్సీ’లో నటించి తెలుగు వారికి పరిచయం అయ్యాడు కానీ తమిళంలో పలు సినిమాల్లో నటించాడు ఈ యువ హీరో.

నర్మద అనే చెన్నైకి చెందిన యువతిని ఈ రోజు పెళ్లాడాడు హరీష్ కళ్యాణ్. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇద్దరిదీ అరెంజ్డ్ మేరీజ్. కానీ, ఇద్దరూ ప్రేమలో ఉన్నంత హంగామా చేస్తున్నారు. పెళ్లి పీటలపైనే ఆమెకి ముద్దు పెట్టి హంగామా చేశాడు హరీష్ కళ్యాణ్.

ఈ హీరో తాజాగా తెలుగులో మరో సినిమా ఒప్పుకున్నాడు.

Advertisement
 

More

Related Stories