ట్రోలింగ్ తట్టుకోలేక పోతున్నాడా?

అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియా ట్రోలింగ్ తో హోరెత్తింది. మూడు రోజులైనా… అమీర్ ఖాన్ కి వ్యతికరేకంగా ట్రెండింగ్ ఆగడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. 56 ఏళ్ల అమీర్ ఖాన్ రెండు సార్లు విడాకులు ఇవ్వడం కన్నా ఆయన ఒక యువ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని పుకారు ఎక్కువ సంచనలం కలిగించింది.

ALSO READ: అమీర్ ఖాన్, కిరణ్ విడాకులు

ఐతే, ఆ హీరోయిన్ తో ప్రేమ అనే మేటర్లో నిజమెంతో ఎవరికీ తెలీదు. పైగా, అది ఆయన వ్యక్తిగత అంశం. ఆ విషయంలో సాధారణ జనం ట్రోలింగ్ చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, ఆమీర్ ఖాన్ కున్న పాపులారిటీ అలాంటిది. పైగా అయనకి మిస్టర్ పర్ ఫెక్ట్ అనే ఇమేజ్ ఉంది కదా.

ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కూడా షికార్లు చేస్తున్నాయి. “బడి మా, చోటీ మా.. ఫాతిమా!” అనే మీమ్ బాగా వైరల్ అయింది.

ఈ ట్రోలింగ్ ఉంటుందని ముందే ఊహించినట్లు ఉన్నారు ఆమీర్ ఖాన్. అందుకే, ఈ ఏడాది మార్చిలోనే ఆయన ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ముందే ప్రిపేర్ అయినట్లు కనిపిస్తోంది.

మరోవైపు, అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగ చైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement
 

More

Related Stories