అసభ్య ప్రచారం ఆపండి: హేమ

TeluguCinema 06 Oct 2021
Hema

మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ప్రచారంలో మరో కలకలం. నటి హేమ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో కొన్నాళ్ల క్రితం వదిలారు. అప్పట్లో ఆమె సైబర్ పోలీసుల సహాయంతో వాటిని తొలగించారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆట మళ్ళీ మొదలు. ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో కొత్తగా అసభ్య ప్రచారం షురూ అయిందట.

‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణి ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. అందులో వారు హేమపై ఘాటైన విమర్శలు చేశారు. ఆ వీడియెలో ఉన్న వారి వ్యాఖ్యలను తీసుకొని… తన ఫోటోలను అసభ్యంగా మార్ఫ్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయట.

కరాటే కళ్యాణి విష్ణు ప్యానెల్ తరఫున పోటీలో ఉన్నారు. నరేష్ కరాటే కళ్యాణికి, విష్ణుకు మద్దతుగా నిలబడ్డ విషయం తెలిసిందే. తన వ్యక్తిత్వాన్ని కించరిచేలా అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా మీ ప్యానెల్ సభ్యులను కట్టడి చేయండి అని నరేష్ ని కోరుతోంది హేమ.

వెంటనే ఇది ఆపకపోతే పోలీసు కేసు పెడతానని అంటున్నారు హేమ.

TeluguCinema

View all posts

Recent News