‘వార్ 2’పై హృతిక్ సెల్ఫ్ ట్రోలింగ్

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు హృతిక్ రోషన్. ఆయన మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ తో కలిసి నటించారు. అదే … “వార్ 2”. ఆ సినిమా ఎంత ఘోరంగా పరాజయం పాలు అయిందో చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే హృతిక్ కూడా సైలెంట్ అయిపోయారు.
అయితే తాజాగా తన సినిమా గురించి తానే ట్రోలింగ్ చేసుకున్నారు హృతిక్ రోషన్.
దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ కి హృతిక్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ ని హోస్ట్ చేసిన యాంకర్ హృతిక్ ని పొగుడుతూ సూపర్ స్టార్ హృతిక్ ని కరతాళ ధ్వనులతో వెల్కమ్ చెప్పాలని వ్యాఖ్యానించాడు. అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు హృతిక్ కి. స్టేజ్ మీదకి వచ్చిన హృతిక్ “మీ అందరికీ థాంక్స్. నా సినిమా ఇటీవల విడుదలై పోయింది. అయినా కూడా మీరు ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా,” అని అన్నారు.
తన సినిమా గురించి తానే ట్రోల్ చేసుకున్నారు హృతిక్. “వార్” సినిమా పెద్ద హిట్. కానీ దానికి సీక్వెల్ గా “వార్ 2” తీస్తే పోయింది.