యుద్ధభూమిలో కలుద్దాం: హృతిక్

NTR and Hrithik Roshan


ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తో మార్మోగుతోంది. ఐతే, హృతిక్ రోషన్ పోస్ట్ చేసిన విషెస్ మాత్రం వెరీ స్పెషల్.

త్వరలోనే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారు. హృతిక్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించనున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. “వార్ 2” పేరు మెన్షన్ చెయ్యకుండా త్వరలోనే “యుద్ధభూమి”లో కలుద్దాం అని హృతిక్ ట్వీట్ చెయ్యడం విశేషం.

అంతే కాదు ఇంగ్లీష్ లో పెట్టిన ఈ ట్వీట్ లో చివర్లో తెలుగులో విషెస్ పెట్టడం విశేషం. “పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా” అని తన ట్వీట్ ని ముగించారు హృతిక్.

హృతిక్ రోషన్, టైగర్ శ్రోప్ కలిసి నటించారు ‘వార్’ చిత్రంలో. ఇప్పుడు సీక్వెల్ లో టైగర్ శ్రోప్ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరారు. ఎన్టీఆర్ కి ఇది మొదటి బాలీవుడ్ చిత్రం. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకుడు.

Advertisement
 

More

Related Stories