ఇలియానా లవ్ లైఫ్!

Ileana

ఇలియానా చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసింది. ఆయన్ని పెళ్లి కూడా చేసుకుంది అని అంటారు. కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు. ఐతే ఇప్పుడు ఆమె ఒంటరి. రెండేళ్ల క్రితం అతన్నుంచి విడిపోయింది. రెండేళ్ల తర్వాత ఆమె లవ్ లైఫ్ గురించి మళ్ళీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ కి చెందిన ఒక ఫేమస్ పర్సనాలిటీతో లవ్ లో ఉందట. వీరి క్లోజ్ బాండింగ్ గురించి చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే ఇందులో నిజమెంత అనేది చూడాలి. 34 ఏళ్ల ఇల్లి బ్యూటీ మాత్రం సైలెంట్ గా ఉంది.

ఇప్పుడు ఆమె కెరీర్ పూర్తిగా బాలీవుడ్ లోనే కొనసాగుతోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలతో ఆమె లైఫ్ సాగుతోంది.

More

Related Stories