అమెరికాలోనే ఉంటున్న ఇలియానా

- Advertisement -
Ileana

రవితేజ కొత్త సినిమాలో ఇలియానా నటించనుంది అని నెల రోజుల క్రితం వార్తలు షికార్లు చేశాయి. రవితేజతో ఇప్పటికే నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఇలియానా. అందులో “కిక్” వంటి సూపర్ హిట్ సినిమా కూడా ఉంది.

మళ్ళీ ఆయన సినిమాతోనే ఆమె కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనుంది అని ప్రచారం జరిగింది. ఐతే అదంతా ఉత్తదే అని తేలింది. ఆమెకిప్పట్లో సినిమాల్లో నటించాలని లేదు.

ఇలియానా గతేడాది ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆమె భర్త మైకేల్ డోలన్ విదేశీయుడు. ఆమె భర్తతో కలిసి ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటోంది.

ఇలియానా తాజాగా తన కొడుకు చలికి ఇబ్బంది పడుతున్నాడు అంటూ అమెరికాలో చలి చంపేస్తోందని పోస్ట్ పెట్టింది. ఫోటోలు షేర్ చేసింది. గతేడాది ఆగస్టులో ఆమె బాబుకి జన్మనిచ్చింది.

ఇక ఇటీవల అజయ్ దేవగన్ “రెయిడ్ 2” అనే సినిమా ప్రారంభించారు. మొదటి భాగంలో ఇలియానా హీరోయిన్. కానీ రెండో భాగంలో ఆమె నటించడం లేదు. ఆమె స్థానంలో వాణి కపూర్ నటిస్తోంది. ఇప్పట్లో ఇండియాకి రాను అని చెప్పిందట. అందుకే, ఆమెని గెస్ట్ రోల్ లో కూడా చూపించడం లేదు ఈ సీక్వెల్లో.

More

Related Stories