కాజోల్ ‘టూ మచ్’గా మాట్లాడుతోందా?

TeluguCinema 13 Nov 2025
Kajol

50 ఏళ్ళు దాటిన తర్వాత కాజోల్ మాట్లాడుతున్న మాటలు, చేష్టలు అతిగా ఉంటున్నాయి అంటున్నారు. ఆమెకి ఈ మధ్య ట్రోలింగ్ పెరిగింది. ఎందుకంటే ఆమె చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.

ఆమె ప్రస్తుతం మరో పాత తరం హీరోయిన్ ట్విన్కిల్ తో కలిసి ఒక చాట్ షో హోస్ట్ చేస్తోంది. ఆ షో పేరే .. టూ మచ్ (‘Two Much With Kajol and Twinkle’). ఆ షోలో ఆమె మొదట దర్శకురాలు ఫరా ఖాన్ తక్కువ చేసి మాట్లాడి విమర్శల పాలు అయింది. తాజాగా మనం వేసుకునే మందులకు (మెడిసిన్స్) ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్లే పెళ్ళికి కూడా ఉండాలి అని మాట్లాడింది.

“పెళ్ళికి క్స్ పైరీ డేట్ ఉండాలి. ఆ తేదీ గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ చేసుకునేలా అవకాశం ఉండాలి. గడువు తేదీ ఉంటే, మనం ఎక్కువ కాలం చింతించాల్సిన అవసరం ఉండదు,” అని కాజోల్ పేర్కొంది.

కాజోల్ కి 51 ఏళ్ళు. ఆమె బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ ని పెళ్లాడింది.వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు నైసాకి 22 ఏళ్ళు. కొడుకు యుగ్ కి 15 ఏళ్ళు.