నిత్య మీనన్ పెళ్లి ఒక హీరోతో?

- Advertisement -

నిత్య మీనన్ పెళ్లి గురించి మరోసారి ప్రచారం మొదలైంది. రెండేళ్ల క్రితం ఆమె ఒక మలయాళ హీరోని పెళ్లాడనుంది అనే వార్త బాగా హల్చల్ చేసింది. ఇప్పుడు అదే ప్రచారం మళ్లీ షురూ.

నిత్యకి 34 ఏళ్ళు. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి చిన్నప్పుడే అడుగుపెట్టింది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. 2008లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కేరళకి చెందిన నిత్య మీనన్ ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ లు, వెబ్ ప్రోగ్రామ్స్, వెబ్ మూవీస్ చేస్తోంది. ఆమెకి లావు సమస్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా తగ్గడం లేదు.

నిత్య సమస్యని అర్థం చేసుకొని ఆమెని పెళ్లాడేందుకు ఒక హీరో ముందుకొచ్చాడని టాక్. కానీ, ఆ హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆమె ఒక హీరోని పెళ్లాడే వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఆమె వీటిని తోసిపుచ్చడం లేదు, ఒప్పుకోవడం లేదు.

నిత్య మీనన్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ కాదు. ఆమె నుంచి పెళ్లి కబురు, అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి మరి.

 

More

Related Stories