బండ్ల బాధ ఇదేనా

Bandla Ganesh


నిర్మాత బండ్ల గణేష్ రెండు రోజులుగా ట్విట్టర్ లో “గురూజీ” అంటూ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన ట్వీట్లు చూస్తే అవి త్రివిక్రమ్ గురించే అని అర్థం అవుతోంది. త్రివిక్రమ్ వల్లే తనకు, పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది అనేది బండ్ల గణేష్ భావన. అందుకే, త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్లు.

ఐతే, త్రివిక్రమ్ చెప్తే పవన్ కళ్యాణ్ విని బండ్ల గణేష్ కి యాక్సెస్ లేకుండా చేశాడనుకుందాం. మరి మిగతా హీరోల సంగతేంటి.

గతంలో రవితేజతో (‘ఆంజనేయులు’) ఎన్టీఆర్ తో (‘బాద్షా’, ‘టెంపర్’), రామ్ చరణ్ తో (‘గోవిందుడు అందరివాడులే’), అల్లు అర్జున్ తో (‘ఇద్దరమ్మాయిలతో’) సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ కి ఆ హీరోల డేట్స్ ఎందుకు దొరకడం లేదు. ఆ హీరోలతో కూడా యాక్సెస్ ని త్రివిక్రమ్ కట్ చేసారా అన్న డౌట్స్ వస్తున్నాయి.

నిజం చెప్పాలంటే వేదిక ఎక్కగానే ఆవేశంగా వాగే బండ్ల గణేష్ కి హీరోల వద్ద పెద్ద గొప్ప ఇమేజ్ లేదు. ఏ హీరో కూడా పిలిచి బండ్ల గణేష్ కి సినిమా చేసే అవకాశం లేదిప్పుడు. పెద్ద హీరోలందరూ దర్శకులు ఎవరనే విషయమే ఆలోచిస్తున్నారు తప్ప నిర్మాత ఎవరైనా ఓకే. అందుకే, బండ్లకి అన్ని చోట్లా డోర్స్ క్లోజ్.

పవన్ కళ్యాణ్ ఒక్కరే బండ్లని కలిసేందుకు, ఫోటోలు దిగేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు అది కూడా బంద్ కావడంతో త్రివిక్రమ్ మీద సెటైర్లు వేస్తున్నారు అని ఒక టాక్. ఇందులో నిజమెంతో చూడాలి.

Advertisement
 

More

Related Stories