మరో సినిమా సైన్ చేసిన ఐశ్వర్య

Iswarya Menon

ఐశ్వర్య మీనన్ తమిళంలో పలు సినిమాలు చేసి తెలుగుకి వచ్చింది. ఆమె నటించిన మొదటి చిత్రం…స్పై. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరో. ఈ నెల 29న విడుదల కానుంది. ఐతే, ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆమెకి మరో సినిమాలో ఆఫర్ దక్కింది.

ఐశ్వర్య మీనన్ తాజాగా కార్తికేయ సరసన ఇంకో సినిమా సైన్ చేసింది. కార్తికేయ ‘ఆర్ ఎక్స్ 100’తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు చేసినా సరైన హిట్ రాలేదు. ఆ మధ్య అజిత్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలు సైన్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ సంస్థ కార్తికేయ, ఐశ్వర్య జంటగా ఒక సినిమా తీస్తోంది.

“ఇప్పటివరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. ‘స్పై’ సినిమాలో రా ఏజెంట్ పాత్ర పోషించా. ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇక నా కెరీర్ సంతృప్తిని ఇచ్చింది. నేను ఇంజనీరింగ్ చేశాను. మోడలింగ్ చేసి ఇటువైపు వచ్చాను,” అని తెలిపింది ఐశ్వర్య.

‘స్పై’ హిట్ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి.

Advertisement
 

More

Related Stories