Advertisement
తెలుగు న్యూస్

175 కోట్ల ఇంట్లోకి వెళ్తోందా?


హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రేమలో పడిందని, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబైలో కొనుక్కున్న కొత్త ఇంట్లో సహజీవనం మొదలుపెట్టనుందని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ తెలిపింది. తాజా అప్డేట్ మన మతిపోయేలా ఉంది. ఆమె కొత్త ఇల్లు అట్లాంటి ఇట్లాంటిది కాదు. అక్షరాలా 175 కోట్ల రూపాయల బంగాళానట.

Also Read: ప్రియుడితో జాక్వెలిన్ సహజీవనం!

అవును మీరు చదివింది కరెక్టే. జాక్వెలిన్, ఆమె బాయ్ ఫ్రెండ్ 175 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ మామూలు వ్యక్తి కాదంట. సూపర్ అండ్ అల్ట్రా రిచ్. పిచ్చ డబ్బు. అందుకే, 175 కోట్లు పెట్టి ముంబైలో అత్యంత ధనవంతులు నివసించే జుహు ఏరియాలో ఈ బంగాళా కొన్నారట.

వీళ్ళ వాలకం చూస్తుంటే… త్వరలోనే పెళ్లి చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. అందుకే… అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసారని టాక్.

జాక్వెలిన్ త్వరలోనే తెలుగులో కూడా నటించనుంది. ఆమె ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాని సైన్ చేసింది.

Advertisement

This post was last modified on June 17, 2021 3:30 pm

Advertisement
Share