ఆనందయ్యకి జగపతి బాబు సపోర్ట్

కరోనాకి మందు కనిపెట్టిన ఆనందయ్య పేరు మార్మోగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇదొక సంచలనం అయింది. ఐతే, ఆయనది ఆయుర్వేదం అని కొందరు, అది నాటు మందు అని మరికొందరు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై కమిటీ వేసింది. అధికారికంగా ఇంకా అనుమతులు రాలేదు. కానీ, ఆ మందు అద్భుతంగా పనిచేస్తోందని నెల్లూరు జిల్లా వారు అంటున్నారు.

Advertisement

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య వివాదాల నడుమ ప్రస్తుతం పోలీసుల ప్రొటెక్షన్ లో ఉన్నారు. జనం నుంచి విపరీతమైన మద్దతు వచ్చింది ఆనందయ్యకి. ఐతే, ఆయన వైద్యాన్ని వ్యతిరేకిస్తున్నారు హేతువాదులు.

సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మిశ్రమ స్పందన ఉంది. రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఇలాంటి నాటు వైద్యాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు అంటున్నారు. కానీ, హీరో జగపతి బాబు మాత్రం ఆనందయ్యకి ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.

“ప్రకృతిమాత మనలని కాపాడడానికి వచ్చినట్లు ఉంది. ఆనందయ్య వైద్యం అధికారికం అనుమతులు పొందాలని, ప్రపంచం మొత్తం కరోనా నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నా,” అంటూ జగపతి బాబు ట్వీట్ చేశారు.

Advertisement
 

More

Related Stories