ఆ ప్రకటన కోసం నిరీక్షణ

TeluguCinema 23 Oct 2025
Janhvi Kapoor and Mrunal Thakur

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. గత మూడు నెలలుగా ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్, ఇతర నటులపై ఎక్కువగా సీన్లు చిత్రీకరించారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న దీపిక పదుకోన్ పై కూడా కొన్ని సన్నివేశాలు తీశారు.

ఐతే, ఈ సినిమాలో దీపిక మాత్రమే హీరోయిన్ కాదు. మరో నలుగురు హీరోయిన్లు నటిస్తారు. అందులో ప్రధానంగా మరో ఇద్దరు భామలతో అల్లు అర్జున్ కి రొమాంటిక్ సీన్లు ఉన్నాయి.

ఈ పాత్రలు కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లను తీసుకోవాలని దర్శకుడు అట్లీ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ పై ఫోటోషూట్ కూడా చేశారు. ఐతే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆ ప్రకటన కోసమే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నిరీక్షిస్తున్నారు.

ఈ సినిమా వారికి అధికారికంగా కన్ఫిర్మ్ అయితే పెద్ద ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నట్లు గర్వంగా ప్రకటించుకోవచ్చు. మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు తమ ఖాతాలో పడుతాయి. అందుకే, ఆ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.

Janhvi Kapoor

జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన “పెద్ది” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పక్కా ఆంధ్ర పల్లెటూరి యువతిలా కనిపిస్తుంది. మార్చి 2026లో విడుదల కానుంది. “పెద్ది” తర్వాత ఆమె అల్లు అర్జున్ సరసన నటించనుంది.

Mrunal Thakur

ఇక మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో “డెకాయిట్” చిత్రంలో నటిస్తోంది. అడవి శేష్ హీరో. ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇది కాకుండా మరో తెలుగు సినిమా లేదు. అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయితే మరిన్ని బడా తెలుగు సినిమాలు ఆమె ఖాతాలో పడుతాయి.