ఎక్కడికి వెళ్లినా జంటగానే!

- Advertisement -

జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా ఆమె బాయ్ ఫ్రెండ్ వెంట ఉండాల్సిందే. ఏ పంక్షన్ కి వెళ్లినా ప్రియుడు శిఖర్ పహారియాతోనే కలిసి వెళ్తుంది. గుడికి వెళ్లినా అతను తోడు ఉంటాడు. ఆ మధ్య ఓ గుళ్లో ఇద్దరూ జంటగా పూజలు కూడా చేశారు.

తాజాగా అనంత్ అంబాని – రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు కూడా వీరిద్దరూ జంటగా వచ్చారు. జంటగా హడావిడి చేశారు. అందుకే, ఇక వీరి పెళ్లి కూడా ఖాయం అనే టాక్ నడుస్తోంది. శిఖర్ కూడా ధనవంతుడే. ముంబైలో సంపన్న వ్యాపార కుటుంబాలకు చెందినవాడే. సో, వీరి పెళ్ళికి ఇరువైపుల పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

ఐతే, జాన్వీ కపూర్ ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ పెళ్లి చేసుకుంటుందా అనేది డౌటే. ఎందుకంటే ఆమె కెరీర్ ఇప్పుడే ఊపందుకొంది. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్ సరసన “దేవర 1”, “దేవర 2” చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఏడాదే రామ్ చరణ్ సరసన దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న కొత్త సినిమాలో కూడా నటించనుంది.

అలాగే “పుష్ప 2″లో కూడా ఆమె గెస్ట్ గా మెరవనుంది. తమిళ అగ్ర హీరో సూర్యతో కూడా ఒక సినిమా చేస్తోంది. కెరీర్ ఇంత సూపర్ గా సాగుతున్న టైములో ఆమె పెళ్లి వైపు ఆలోచన చేస్తుందా?

ALSO CHECK: Janhvi Kapoor in a Rouge Saree

 

More

Related Stories