పరమ్ సుందరి హిట్టా ఫట్టా?

జాన్వీ కపూర్ హీరోయిన్ గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన “పరమ్ సుందరి” గత వీకెండ్ విడుదలైంది. ఐతే, ఈ సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్లను రాబట్టలేదు. జాన్వీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ తెగ టూర్లు వేసి ప్రచారం చేశారు.
మొదటి వీకెండ్ ఈ సినిమా ఇండియాలో 27 కోట్లు కొల్లగొట్టింది. జాన్వీ కపూర్ రేంజ్ కి, సిద్ధార్థ్ రేంజ్ కి ఇది మంచి ఓపెనింగ్. ఐతే, ఈ వీక్ మొత్తం ఈ సినిమా నిలబడడం ముఖ్యం. అదే పెద్ద సమస్య. మొదటి వీకెండ్ ఫర్వాలేదు అనిపించుకొంది. వీక్ డేస్ లో నిలబడి మళ్ళీ రెండో వీకెండ్ వరకు బాక్సాఫీస్ బరిలో ఉండగలిగితేనే ఈ సినిమా హిట్ అనిపించుకోగలదు. లేదంటే ఫ్లాప్ కింద జమ కడుతారు.
నిజానికి గత వారం హిందీలో కాంపిటీషన్ లేదు. కేరళలో చాలా సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కేరళ అమ్మాయిగా నటించింది. అందుకని ఓనం పండుగని దృష్టిలో పెట్టుకొని గత శుక్రవారం రిలీజ్ చేశారు. కానీ కేరళ ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు.
జాన్వీ కపూర్ కి హిందీలో పెద్ద హిట్ కొట్టాలన్న కోరిక ఇంకా తీరడం లేదు.