“మా సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెప్పాం. ఇది ప్రయోగాత్మక చిత్రం కాదు. కొత్తదనం కాదు వినోదం ఉంటుంది అని ముందే చెప్పాం. అయినా కూడా రివ్యూలలో కొందరు కొత్తగా లేదు అంటూ వంకలు పెట్టడం కరెక్ట్ కాదు. మా సినిమా ఏంటో, ఏమి ఆశించాలో కరెక్ట్ గా ప్రిపేర్ చేశాం. ఇది పూర్తిగా ఫన్ ఫిలిం.”
హీరో కిరణ్ అబ్బవరం రియాక్షన్. ఈ రోజు సినిమా విడుదలైన తర్వాత “కె – ర్యాంప్” టీం మీడియాని కలిసింది. తమకు సాధారణ పేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది కానీ కొందరు సోషల్ మీడియాలో క్రిటిక్స్ తప్పుదోవ పడేలా కామెంట్ చేశారని అంటున్నారు టీం.
“రేటింగ్ ఎంత ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. కానీ సినిమాల విషయంలో పక్షపాతం చూపించడం సరికాదు. పెద్ద హీరో చిత్రానికి అయినా, చిన్న హీరో చిత్రానికి అయినా ఒకే తీరుగా స్పందించాలి. కొన్ని సినిమాలకు హడావిడిగా రివ్యూలు ఇచ్చి, మరికొన్నింటికి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇది తప్పు. చిన్న నిర్మాతల సినిమాల విషయంలో ఏమి చేసినా ఊరుకుంటారు అని భావిస్తున్నారా?,” అని నిర్మాత రాజేష్ దండా ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ కి, రివ్యూస్ కి, సినిమాలో ఉన్న కంటెంట్ కి పొంతన లేదని తన స్నేహితులు చెప్పారని దర్శకుడు జైన్స్ నాని అన్నారు. కొత్త దర్శకులకు ప్రోత్సాహం ఇచ్చేలా కామెంట్స్ ఉండాలి అని కోరారు.
The confusion surrounding the release plans of Ravi Teja’s upcoming film “Irumudi” has finally come…
Taapsee Pannu has opened up about why she significantly reduced her activity on social media…
Ram Charan’s “Peddi” may have received mixed reviews and sparked controversy over Janhvi Kapoor’s scenes,…
The debate surrounding the portrayal of female characters in films continues to gain momentum. After…
Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…
Every actor has a dream co-star they wish to work with, and actress Raashi Khanna…