ప్రెగ్నన్సీలోనూ ఫుల్లుగా సంపాదన


సాధారణంగా హీరోయిన్లు గర్భం దాల్చగానే సినిమాలకు దూరం అవుతారు. వాళ్ళకి బ్రాండ్స్ ద్వారా వచ్చే సంపాదన కూడా పడిపోతుంది. ఎందుకంటే కడుపుతో ఉన్న హీరోయిన్లతో యాడ్స్ షూట్ చెయ్యలేరు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ ఫుల్లుగా సంపాదిస్తోంది.

ప్రెగ్నెంట్ అవగానే ఆమె సినిమాలు మానేసింది. నాగార్జున సరసన నటించాల్సిన సినిమా వదులుకొంది. ఐతే, తెలివిగా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం బిజీగా మారింది. రకరకాల ఫోటోషూట్లు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకొంది. అంతే కాదు, గర్భవతులకు సంబందించిన ఉత్పత్తులు అమ్మే బ్రాండ్స్ ని ప్రోమోట్ చెయ్యడం మొదలు పెట్టింది.

తల్లుల, కాబోయే తల్లులకు సంబంధించిన బ్రాండ్స్ ని సైన్ చేసి ప్రతివారం ఒక బ్రాండ్ ని ప్రోమోట్ చేస్తోంది. అలా… ఆమె ఈ టైంలో కూడా కొత్త సంపాదన మార్గాన్ని వెతుక్కొంది.

ప్రస్తుతం ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉంది. మరో రెండు నెలల్లో ఆమె డెలివర్ డేట్. డెలివరీ అయిన ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని సినిమాల్లో నటించే ఆలోచనలో ఉంది కాజల్.

Advertisement
 

More

Related Stories