బట్టల బిజినెస్లో కమల్ బిజీ

TeluguCinema 26 Jan 2022
Kamal Haasan


నటుడు కమల్ హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు అనేది పాత న్యూస్. ఆయన తన పేరుపై క్లోతింగ్ లేబిల్ ని లాంచ్ చేసి ఖద్దరు బట్టలు అమ్ముతున్నారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని…. దీనికోసం వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశారు.

తమ ఖద్దరు దుస్తులు ఎవరికి కావాలనుకున్నా ప్రపంచంలో వారు ఎక్కడవున్నా ఆ చోటుకి వెంటనే డెలివరీ చేస్తామని కమల్ చెప్తున్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలంట.

విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలు, హీరోయిన్లు ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు. ఐతే, కమల్ వస్త్ర వ్యాపారం ప్రత్యేకం. మగ్గాలపై నేసిన చేనేత వస్త్రాలనే మాత్రమే అమ్ముతున్నారు కమల్. అలాగే, సింథటిక్ రంగులు వాడరు. పూర్తిగా నేచురల్ డైయింగ్ అని చెప్తున్నారు కమల్. తన దుస్తుల బ్రాండ్ ని కమల్ హాసన్ సీరియస్ గా ప్రోమోట్ చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆయన బిజిగా ఉన్నారు.

మరోవైపు, కమల్ ప్రస్తుతం ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవి సెలవుల్లో విడుదల కానుంది.