కంగన మెచ్చిన దర్శకుడు


ప్రస్తుతం ఇండియాలోనే ఇప్పుడు నెంబర్ వన్ దర్శకుడు మన రాజమౌళి. ఆయన పేరు చాలు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రావడానికి అని ‘ఆర్ ఆర్ ఆర్’తో మరోసారి ప్రూవ్ అయింది. హిందీ మార్కెట్ లో కూడా గ్రిప్ పొందారు రాజమౌళి.

Advertisement

వివాదాస్పద మాటలతో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్ కంగనా కూడా రాజమౌళికి వీరాభిమానిగా మారారు. “ఆర్ ఆర్ ఆర్” సినిమా వసూళ్లు చూసి ఆమె రాజమౌళిని ఆకాశానికి ఎత్తారు. మీకు ఎప్పటికీ అభిమానినే అంటూ పొగడ్తల పోస్ట్ ఒకటి వచ్చింది ఆమె నుంచి. అంతే కాదు, పనిలో పనిగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి చురకలు పడ్డాయి.

ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ మీరే అంటూ రాజమౌళికి పట్టం కట్టారు కంగన.

కంగన ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో నటించలేదు. కానీ, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆమెతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన ‘మణికర్ణిక’, ‘తలైవి’ చిత్రాలకు స్క్రిప్ట్ అందించింది ఆయనే. మరి విజయేంద్రప్రసాద్ రికమెండేషన్ తో ఆమె రాజమౌళి తీసే తదుపరి చిత్రాల్లో నటిస్తుందా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories