ఆ హీరోలది క్రిమినల్ మైండ్: కంగన

బాలీవుడ్ పెద్ద హీరోల గురించి ఎప్పుడూ ఏవేవో నెగెటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తుంది కంగన రనౌత్. తన సోషల్ మీడియా వేదిక నుంచి ఆమె వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటుంది. లేటెస్ట్ గా తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించి అలాగే రణబీర్ కపూర్ గురించి కొన్ని విషయాలు రాసింది. ఇద్దరిదీ క్రిమినల్ మైండ్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

వీరి గురించి ఆమె రాసిన కామెంట్లు చూద్దాం.

హృతిక్ రోషన్

“సినిమా రంగం మాఫియా ఎప్పుడూ క్రిమినల్ మైండ్ తోనే ఆలోచిస్తుంది. ఒక సూపర్ స్టార్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేశాను. కానీ అతను మాత్రం తాను డేటింగ్ చెయ్యలేదని చెప్పాడు. ఆయన పేరుని వాడుకున్న మరో వ్యక్తితో నేను చాటింగులు చేశాను అన్నాడు. అతను ఎప్పుడూ ఫోన్ నంబర్లు మార్చేవాడు. వేర్వేరు నంబర్లతో నాతో మాట్లాడేవాడు. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బందుల్లో పడకుండా అలా వేరే నంబర్ల నుంచి సంభాషణలు చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది… అతనివి ఎప్పుడూ అక్రమ పద్ధతులే అని.”

రణబీర్ కపూర్

“ఇక మరో సూపర్ స్టార్ ఉన్నాడు. పక్కా స్త్రీలోలుడు. నన్ను డేటింగ్ చెయ్యమని వెంటపడ్డాడు. మరి నీకు గాళ్ ఫ్రెండ్ ఉందిగా అంటే… ఆమెతో చేస్తున్న మూడు భాగాల ఒక సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ అన్నట్లుగా మాట్లాడాడు. ఆమె అంటే ఇష్టం లేదని కానీ తప్పక ఆమెతో ఉన్నాను అన్నట్లుగా మాట్లాడి నా కోసం పరితపించాడు. కానీ నేను పట్టించుకోలేదు. వీళ్లంతా ఇంతే…. సక్రమంగా ఉండరు.”

Advertisement
 

More

Related Stories