‘మిరాయ్‌’ ఊహకు మించేలా ఉంది

TeluguCinema 06 Sep 2025
Karthik Ghattamaneni about Mirai

తేజ సజ్జా హీరోగా రూపొందిన చిత్రం… ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దర్శకుడితో ముచ్చట్లు

మిరాయి అంటే ఏమిటి? కథ ఏమిటి?

చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలతో మిరాయ్ కథని డెవలప్ చేశా. అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉండేవని ఒక నమ్మకం ఉంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది మిరాయ్ ఐడియా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో పురాణాల్లోనే ఉంటుందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వంచర్ గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్. కథ అంతా వర్తమానంలోనే జరుగుతుంది.

సినిమా జనాల అంచనాలను అందుకుంటుందా?

మేము ముందు ఊహించిన దానికన్నా మంచి అవుట్ ఫుట్ ఫేచింది. ఇందులో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది. అది పేపర్ మీద చూసుకున్నప్పుడు నిజంగా ఎలా అవుతుందా అనిపించింది. శ్రీలంకలో షూట్ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది, ఆడియన్స్ అందరూ సర్ప్రైజ్ అవుతారు.

మిరాయ్ కి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా?

సీక్వెల్ చేసే పొటెన్షియల్ మిరాయ్ కథకి వుంది. రిజల్ట్ ని బట్టి అలోచించాలి.