
కత్రిన కైఫ్ నిన్న తన 38వ పుట్టిన రోజు జరుపుకొంది. 40లోకి ఎంట్రీ ఇవ్వకముందే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది కత్రిన. నిన్న ఆమెకి సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన సెలెబ్రిటీలల్లో ఎక్కువ శాతం ఈ ఏడాది పెళ్లి కావాలని విష్ చెయ్యడం విశేషం.
సల్మాన్ ఖాన్ మేనేజర్ కూడా అలాంటి విష్ చేశాడు. “త్వరలోనే నిన్ను కూతురు” లుక్ లో చూస్తానని అనుకుంటున్నా అంటూ అతను పోస్ట్ చెయ్యడంతో ఆమె పెళ్ళికి ముహూర్తం ఖరారు అయింది అన్న టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఇప్పటికీ కత్రిన వ్యవహారాలు చూస్తుంటాడు.
ప్రస్తుతం కత్రిన… యువ హీరో విక్కీ కౌశల్ తో లవ్ లో ఉంది. వీరి పెళ్లి గురించే టాక్ నడుస్తోంది. ఐతే, పెళ్లిపీటలు ఎక్కేంతవరకూ బాలీవుడ్ ప్రేమపక్షుల పెళ్లి కబుర్లను నమ్మలేం. గతంలో రన్బీర్ కపూర్ తో, సల్మాన్ ఖాన్ తో కూడా ఇలాగే పెళ్లి కబుర్లు వినిపించాయి. మరి ఈ సారైనా కత్రిన పెళ్లి ‘కల’ నెరవేరుతుందా? ఆమెకి పెళ్లి కళ వస్తుందా?