పెళ్లి ఆలోచన పక్కకెళ్ళిందా?

- Advertisement -

ఈ మధ్య కీర్తి సురేష్ పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. రకరకాల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక బీజేపీ నాయకుడితో పెళ్లి అని మొదట రూమర్ వచ్చింది. రీసెంట్ గా సంగీత దర్శకుడు అనిరుధ్ తో పెళ్లి ఫిక్స్ అని గట్టిగా వినిపించింది. కానీ, కీర్తి మాత్రం వీటి గురించి పెదవి విప్పడం లేదు. అస్సలు పెళ్లి ఆలోచనే ఇప్పుడు లేదన్నట్లుగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటోంది.

రంగ్ దే’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరోవైపు, మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది. రజినీకాంత్ చిత్రం ‘అన్నత్తే’లో కూడా కీర్తి నటిస్తోంది. ఐతే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుకాలేదు. విజయ్ కొత్త సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందట. పెళ్లి ఆలోచన ఉంటే కొత్తగా సినిమాలు ఒప్పుకునేది కాదు.

అన్నట్లు, ఈ మధ్య గ్లామర్ గా మారింది. ఆ ఫోటోలను రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తోంది.

Also Check: Keerthy Suresh’s Latest Glam Stills

More

Related Stories