మహేష్ సరసన నటించనుందా?

- Advertisement -
Kriti Shetty


కృతి శెట్టికి అన్ని కలిసొస్తున్నాయి. తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల కాకముందే రెండు సినిమాలు సైన్ చేసింది. ఇక ఫస్ట్ మూవీ సెన్సషనల్ విజయం సాధించాక, ఆమె డిమాండ్, క్రేజ్ అమాంతం పెరిగాయి. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అనేది టాక్. ఇందులో నిజమెంతో తెలీదు… కానీ కృతి శెట్టి దశ ఆ రేంజులో తిరిగింది అని అర్థమవుతోంది.

మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో రాజమౌళి – మహేష్ బాబు సినిమా ప్రారంభం అవుతుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒకటి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోటి మూవీస్ చెయ్యాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ… అనిల్ రావిపూడి మూవీ కనుక ఈ ఏడాదే మొదలైతే… కృతికి అవకాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది అని ఆమె డేట్స్ ని అడిగి పెట్టారట.

కృతి ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’లో నటిస్తోంది. అలాగే, సుధీర్ బాబు సరసన ఇంద్రగంటి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తోంది.

 

More

Related Stories