78 కోట్ల ఇల్లు కొన్న హీరోయిన్

TeluguCinema 16 Aug 2025
Kriti Sanon

డబ్బులుంటే హీరోహీరోయిన్లు ఎవరైనా చేసే మొదటి పని ప్రాపర్టీలు కొనడం. హీరోయిన్ కృతి సనన్ కూడా దీనికి మినహాయింపు కాదు.

ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని పాలి హిల్ ప్రాంతంలో బీచ్ కు ఎదురుగా ఉన్న డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసింది కృతి సనన్. దీని ఖరీదు అక్షరాలా రూ.78.20 కోట్లు.

బిల్డింగ్ లోని 14, 15 అంతస్తులను కలిపి కట్టిన ఈ పెంట్ హౌజ్ విస్తీర్ణం 6636 చదరపు అడుగులు.
పెంట్ హౌజ్ కాబట్టి, పై అంతస్తులో అదనంగా మరో 1209 చదరపు అడుగుల ఓపెన్ టెర్రస్ కలిసొచ్చింది. ఇదంతా ఇప్పుడు కృతి సొంతం.

ఈ పెంట్ హౌజ్ కు ప్రత్యేకంగా 6 కారు పార్కింగ్ లు వచ్చాయి. ఈ ఆస్తిని కృతి, ఆమె తల్లి సంయుక్తంగా కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ కింద ఈ హీరోయిన్ ఏకంగా 4 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించింది.

Kriti Sanon

ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే ఇంటి రేటు 84.16 కోట్ల రూపాయలు అయింది. ప్రస్తుతం ఈమె ఓ ఎన్నారై వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.