తెలుగు నేర్చుకుంటున్న కృతి!

- Advertisement -
Kriti Sanon


కృతి సనన్ హీరోయిన్ గా మారింది తెలుగు సినిమాతోనే. మోడల్ గా వర్క్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న కృతి సనన్ ని హీరోయిన్ గా పరిచయం చేశాడు దర్శకుడు సుకుమార్. మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ ఆమె తొలి చిత్రం. ఐతే, ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడం, అక్కడే సక్సెస్ కూడా చూడడంతో కృతి ఇటువైపు చూపు వెయ్యలేదు. ఇన్నేళ్లకి ఆమె ప్రభాస్ సరసన నటిస్తోంది.

‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్ర పోషిస్తోంది. ముంబైలో షూటింగ్ జోరుగా సాగుతోంది. దాంతో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటోంది అని టాక్.

‘ఆదిపురుష్’ సినిమా ప్రధానంగా హిందీలోనే తీస్తున్నారు. కానీ కొన్ని కీలకమైన సీన్లని తెలుగులో కూడా సెపరేట్ గా తీస్తున్నారు. ఇది ద్విబాషాచిత్రంగా రూపొందుతోంది. మొత్తమ్మీద, ఆమెకి మళ్ళీ ఇన్నేళ్లకి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం పడింది.

 

More

Related Stories