మ్యాప్ పట్టుకొన్న మహేష్ బాబు!

TeluguCinema 05 Sep 2025
Mahesh Babu

ఓ పెద్ద సినిమాను లీకుల బారి నుంచి కాపాడటం చాలా కష్టమైపోతోంది. దీనికి రాజమౌళి కూడా మినహాయింపు కాదు. మహేష్-రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి లీకులు మొదలయ్యాయి.

ప్రస్తుతం కెన్యాలో షూట్ చేస్తున్నాడు మహేష్. అక్కడ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అవి కాస్తా ఇండియాలో వైరల్ గా మారాయి. చేతిలో ఓ మ్యాప్ పట్టుకొని యాక్షన్ సీన్ లో కనిపిస్తున్న మహేష్ లుక్స్ అవి.

ఈ లీకులతో మహేష్ లుక్స్ పై పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. కంప్లీట్ యాక్షన్ లుక్ లో మహేష్ ఇందులో కనిపిస్తున్నాడు. ఊహించని విధంగా ఇలా స్టిల్స్ లీక్ అవ్వడంతో యూనిట్ షాక్ లో ఉంది.

నిజానికి మహేష్-రాజమౌళి సినిమా లీకులు కొత్తేంకాదు. గతంలో ఒరిస్సాలో షూటింగ్ చేసినప్పుడు కూడా కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఔట్ డోర్ లో షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటివి తప్పవు. కాకపోతే కెన్యా నుంచి కూడా లీక్ అవ్వడం విచిత్రం.