లోల్‌ సలామ్‌ ట్రైలర్‌ రిలీజ్

TeluguCinema 12 Jun 2021
Lol Salaam trailer

తెలుగునాట వెబ్‌సిరీస్‌ ల జోరు మొదలైంది. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైవిధ్యమైన కథాంశంలతో పలు వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. లెటెస్ట్ గా నవ్వించడమే ధ్యేయంగా ‘లోల్‌సలామ్‌ ’ పేరుతో జీ-5లో ఓ వెబ్‌సీరిస్‌ రాబోతుంది.

ఆరు ఏపిసోడ్స్‌లతో పూ ర్తివినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్‌సీరిస్‌ ఈ నెల 25న విడుదల కాబోతుంది. దీని ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేసి తన శుభాకాంక్షలు అందజేశారు.

“కరోనా సంక్షోభం వల్ల ఒత్తిడితో ప్రజలని పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయడమే మా ధ్యేయం. దైనందిన జీవితంలో వున్న టెన్షన్‌లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అనేది పూ ర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాం,” అని మేకర్స్ తెలిపారు.