మాళవికకి లక్ కలిసిరావట్లేదు!

- Advertisement -
Malvika Nair

మాళవిక నాయర్… మంచి అందెగత్తె. ఇక నటన అద్భుతం. ఇప్పుడున్న హీరోయిన్లలో కాంప్లెక్స్ పాత్రలు సమర్ధంగా పోషించేగలిగే నటి. కానీ ఈ అమ్మడికి లక్ మాత్రం కలిసి రావట్లేదు. అదృష్టం ఆమెకి కిలోమీటర్ దూరంలోనే ఆగింది. అందుకే, విజయాలు దక్కట్లేదు.

ALSO CHECK : Malvika Nair flaunts her tattoos in a sleeveless outfit

మాళవిక నాయర్ ఇటీవల మూడు చిత్రాల్లో కనిపిస్తే… ఆ మూడూ ఆడలేదు. నాగ చైతన్య సరసన ‘థాంక్యూ’లో ఒక చిన్న పాత్ర మాత్రమే చేసింది మాళవిక. హీరోయిన్ గా మాత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘అన్ని మంచి శకునములే’ చిత్రాల్లో నటించింది. కానీ ఫలితం నిరాశపరిచింది.

ఆమె కుర్రాళ్లని ఆకట్టుకునేందుకు పొట్టి పొట్టి షార్ట్స్ ధరించింది ‘అన్ని మంచి శకునములే’. అయినా జనం ఆమెకి హిట్ ఇవ్వడం లేదు.

హైదరాబాద్ లోనే స్థిరపడ్డ ఈ బ్యూటీకి ఎప్పుడు నిజమైన బ్రేక్ వస్తుందో చూడాలి. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అదే మిస్ అయింది ఈ మిస్ కి.

 

More

Related Stories