ప్రకాష్ రాజ్ కి కోపమొస్తోంది!

- Advertisement -
Prakash Raj


ప్రకాష్ రాజ్ లో అసహనం మొదలైంది. ఆయన “జస్ట్ ఆస్కింగ్” అంటూ నర్మగర్భ ట్వీట్లు వేస్తున్నారు. దీనికి కారణం… ‘మా’ అధ్యక్షుడు నరేష్ వ్యవహారశైలి అనే మాట వినిపిస్తోంది. ‘మా’ అధ్యక్షుడిగా బరిలోకి దిగుతాను అని ఇప్పటికే ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఐతే, ఎన్నికలు జరిపే విషయంలో నరేష్ తాత్సారం చేస్తున్నాట్ట. ఇప్పటికే సెప్టెంబర్ 12న ఎన్నికలు జరిపేందుకు నరేష్ అంగీకరించారు. ఐతే మళ్ళీ ఎదో తిరకాసు పెట్టి ఆ ఎన్నికల ప్రక్రియని వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ అనుమానిస్తున్నారు. అందుకే ఆయనలో అసహనం పెరిగింది.

ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే వందలమంది నటుల మద్దతు ఆయన సంపాదించారు. ప్రకాష్ రాజ్ ని గెలవనివ్వకుండా చెయ్యాలి నరేష్ వర్గం పట్టుదలగా ఉంది.

‘మా’లో మొత్తంగా 900 పైచిలుకు సభ్యులున్నారు. 500కి మించి ఓటు వెయ్యరు. ఒక 250 నుంచి 300 మంది మద్దతు సంపాదిస్తే చాలు విజేత కాగలరు. ప్రకాష్ రాజ్ కి దాదాపు 400 మంది సపోర్ట్ ఉందట.

ప్రకాష్ రాజ్ ప్రస్తుతానికి బహిరంగంగా ఎలాంటి హడావిడి చెయ్యడం లేదు. కొంచెం లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అసలు హంగామా ఉంటుంది.

More

Related Stories