ఆగస్టు 15న ‘మాస్ట్రో’ విడుదల?


నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాస్ట్రో’ సినిమా హక్కులు హాట్ స్టార్ కొనుక్కొంది అనేది పాత న్యూసే. ఈ సినిమా థియేటర్లో విడుదల కావడం లేదు. డైరెక్ట్ గా హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 15న ‘మాస్ట్రో’ని తమ సైట్ లో స్ట్రీమ్ చెయ్యాలని హాట్ స్టార్ భావిస్తోంది.

ఐతే, ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసి ఫైనల్ కాపీ రెండు వారాల్లో ఇవ్వాలి. అప్పుడే ఆ డేట్ కి స్ట్రీమ్ చెయ్యగలరు. ఓటిటి కంపెనీలు నెల ముందే ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేస్తాయి. ఇప్పుడు టీం అంతా అదే పనిలో ఉంది.

నితిన్ కెరీర్లో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతోన్న మొదటి సినిమా ఇదే. దాదాపు 30 కోట్లకు కొనుగోలు చేసింది హాట్ స్టార్. నిర్మాతకు మంచి గిట్టుబాటు అయిందని టాక్. ఇది హిందీలో సూపర్ హిట్టైన ‘అంధధూన్’కి రీమేక్. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో నితిన్ సరసన నభా నటేష్ నటించింది. విలన్ పాత్రలో తమన్న కనిపిస్తోంది. ఆమెకి ఇదే మొదటి నెగెటివ్ రోల్. హిందీలో ఈ ఆ పాత్రని టబు పోషించారు.

నితిన్ త్వరలోనే ‘మాస్ట్రో’ ప్రమోషన్లు షురూ చేస్తాడు. ఇప్పటికే ఒక పాట విడుదలైంది.

Advertisement
 

More

Related Stories