మహేష్ బాబు, నాని మల్టీస్టారర్!

Nani and Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకుముందు వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్ తీశారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు కొన్ని మల్టీస్టారర్లు ప్లాన్ చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహేష్ బాబుతో కలిసి నటిస్తారా అంటే ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

“మహేష్ అన్నతో మల్టీస్టారర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా,” అని ఒక అభిమాని ట్విట్టర్లో నానికి ప్రశ్న వేశాడు. దానికి నాని ఇచ్చినసమాధానం – “అలా జరిగితే బాగుంటుంది. త్రివిక్రమ్ గారు వింటున్నారా?”

గతంలో నానితో త్రివిక్రమ్ ఒక మల్టీస్టారర్ మూవీ అనుకున్నారు. కానీ అది ఆలోచనతోనే ఆగిపోయింది. అందుకే, త్రివిక్రమ్ ని ట్యాగ్ చేశాడు నాని.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన ఒక ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాని. ఇదంతా “హాయ్ నాన్న” సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్విట్టర్లో చేసిన చాటింగ్.

Advertisement
 

More

Related Stories