హీరోలందరికీ తాట ఊడిపోద్ది: మహేష్

Mahesh Babu and Sreeleela

హీరోయిన్ శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్. ఆమె డ్యాన్స్ తోనే పాపులర్ అయింది. ఆమె తాజాగా మహేష్ బాబుతో నటించింది. “గుంటూరు కారం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఆమె డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు

“చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం ఆనందంగా ఉంది. నేను పని చేసిన హీరోయిన్లలో అత్యంత కష్టపడి పనిచేసే వారిలో ఒకరు. ఆ అమ్మాయికి సంబంధించిన సన్నివేశం ఉన్నా లేకున్నా సెట్స్ లోనే ఉంటుంది. మేకప్ వ్యాన్ లోకి వెళ్ళదు. మా టీం అందరికీ ఆమె అంటే అభిమానం,” అని ఆమెపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఆమె డ్యాన్స్ గురించి మహేష్ మాట్లాడినప్పుడు సభ అంతా అల్లరి. “వామ్మో… అదేం డ్యాన్స్.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది,” అని మహేష్ బాబు చెప్పారు.

గుంటూరు సిటీలో ఈ ఈవెంట్ మంగళవారం సాయంత్రం జరిగింది. మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ గురించి కూడా గొప్పగా చెప్పారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎప్పుడు నటించినా తనలోని ఉత్తమ నటన వస్తుంది అన్నారు మహేష్ బాబు.

Advertisement
 

More

Related Stories