
ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా “గుంటూరు కారం” నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు సిగరెట్ కాల్చుతున్న లుక్ ఉంది. లుంగీ కట్టుకొని బెంచిపై కూర్చున్న మహేష్ బాబు సిగరెట్ వెలిగిస్తున్న తీరుని చూసి “కిరాయి కోటిగాడు” సినిమా గుర్తొస్తోందని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అంటున్నారు.
1983లో విడుదలైన “కిరాయి కోటిగాడు” కృష్ణ కెరీర్లో మంచి హిట్ మూవీ. కోదండరామి రెడ్డి తీసిన ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్.
“నమస్తే సుస్వాగతం” వంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో. ఈ సినిమాలో కృష్ణ ఎప్పుడూ సిగరెట్ తాగుతూ ఉంటారు.
“పేరు కోటి. ఊరు తెనాలి” అది కృష్ణ మొదటి డైలాగ్ ఈ సినిమాలో. త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” కూడా గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో జరిగే కథ. ఐతే, రెండు కథలు మాత్రం ఒక్కటి కాదు.
ఇంతకుముందు చిత్రీకరించిన పోర్షన్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఫ్రెష్ గా తీస్తున్నారట. ఈ సినిమా కథలో విలేజ్ సీన్లు, ఫ్యామిలీ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ ఇలా మిక్స్ చేసి ఉంటాయి అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంటుంది.