- Advertisement -

‘ప్రేమ ఖైదీ’ సినిమాతో 1990లో హీరోయిన్ గా సంచలనం సృష్టించిన నటి…మాలాశ్రీ. కరోనా సంక్షోభం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి ఆమె భర్త రాము కన్నుమూశారు. కోవిడ్ వ్యాధితో పోరాడి చనిపోయారు. ఆయనకి 52 ఏళ్ళు.
రాము కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 50 లక్షల బడ్జెట్ అంటే భారీ చిత్రం అని కన్నడ సినిమా పరిశ్రమలో భావించే రోజుల్లోనే ఆయన కోటి రూపాయల పైనే బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. దాదాపు 30 చిత్రాలు నిర్మించారు. అందులో డజన్ వరకు మాలాశ్రీ హీరోయిన్ గా నటించినవే.
మాలాశ్రీ, రాము దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.